సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మండలం దెయ్యాల తిప్ప గ్రామంలో నేడు, సోమవారం ఇంటింటికీ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటింటికి తిరుగుతూ గత మూడేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజమైన తృప్తి ప్రజాసేవలోనే ఉందని, ప్రజల కళ్లలో ఆనందం చూడాలనే సంకల్పంతో అర్హులందరికీ నవరత్న పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారు. జగన్ సర్కర్ గత మూడేళ్ల పాలనలో దెయ్యాల తిప్పా గ్రామంలోని ప్రజలకు రూ.8 కోట్ల 50 లక్షలకు పైగా సంక్షేమం అందించిందని, గ్రామంలోని రైతులకు రూ.9 లక్షల సబ్సిడీతో రూ. ఆక్వా రైతులకు 1.5 విద్యుత్. దాదాపు 14 సంక్షేమ పథకాలు ఈ గ్రామ ప్రజలకు అందజేస్తామని, అన్నారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, తిరుమని ఏడుకొండలు, ఇంచార్జి ఎంపీడీఓ రామచంద్ర ప్రభు, డిప్యూటీ తాసీల్దార్ ప్రసాద్, పలుశాఖల జేఈలు నరసయ్య, శశికుమార్, శ్రీనివాస్, కనకరావు, సర్పంచ్‌లు తిరుమాని శ్రీనివాసరావు, బొమ్మిడి బాబు రాజేంద్రప్రసాద్, కొల్లా బాలకృష్ణ, నాగిడి నారాయణస్వామి, రమణి శివాజీ వర్మ, జల్లా కొండయ్య, ఎంపీటీసీ రమణి నరసింహస్వామి,సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
