సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముక్కు మొఖం పరిచయం లేకపోయినా పేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రామ్ , చాటింగ్ లు చదువుకునే అమ్మాయిలకు ఎంత ప్రమాదకరమో ఈ తాజా ఘటన చెపుతుంది.. గుంటూరు జిల్లా, తక్కె ళ్లపాడు గ్రామంలో ఒక ప్రేమోన్మాది చేతిలో డెంటల్ డాక్టర్ కావాలని కలలు కన్నా ఒక విద్యార్థిని బలయింది. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నేటి మంగళవారం ఉదయం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారని సమాచారం.. పెదకాకాని సీఐ సురేష్ బాబు కథనం ప్రకారం .. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) 3వ సంవత్సరం చదువుతోంది. కృ ష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్( హైదరాబాద్) జ్ఞానేశ్వ ర్ గత రెండేళ్ల క్రితం ఇన్స్ట్రాగామ్లో ఆమెతో పరిచయం పెంచుకొన్నాడు. అయితే ఇటీవల జ్ఞానేశ్వర్ ప్రేమిస్తున్నానంటూ ఆయువతిని వేధిస్తుండటం తో ఇటీవల ఆమె విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిం ది. పోలీసులు అతడిని స్టేషన్కు పిలిచి కౌన్సె లింగ్ ఇచ్చి హెచ్చరించారు. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ వేధిం పుల్ని ఆపలేదు. దీంతో తపస్వి ని 10 రోజుల క్రితం తక్కె ళ్లపాడు డెంటల్ కాలేజీ విద్యార్థిని అయిన తన స్నే హితురాలి రూమ్కు వెళ్లి అక్క డే ఉంటుండగా.. జ్ఞానేశ్వర్ గత సోమవారం రాత్రి సర్జికల్ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని మృగంగా మారి సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు. స్థానికులు అక్క డికి చేరుకుని జ్ఞానేశ్వర్ ను కొట్టి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందిం చారు. తపస్వి ని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్ ఆస్ప త్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *