సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల విద్యాలయాలలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థినులు వేధింపులు కు గురి అవుతున్న కేసులు,ఈ కేసులలో ఉపాధ్యాయుల పాత్ర ఉండటం దురదృష్టకరం. ఇటువంటి తరహాలోనే.. యలమంచిలి ఎస్‌ఐ జేవీఎన్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాలివి.. మేడపాడు హై స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మట్ల దైవ ఆశీర్వాదకుమార్‌ గతంలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు అభియోగాలు రావడంతో విద్యాశాఖ అధికారులు అతనిని మూడు నెలల క్రితం సస్పెండ్‌ చేశారు. ఇటీవల విద్యాశాఖాధికారులు అతనిపై విచారణ చేపట్టి అతనిపై వచ్చిన అభియోగాలు నిజమని విద్యా శాఖ అధికారులు ధ్రువీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. డీఈవో ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *