సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ” జయహో బీసీ మహాసభ‘ కు రాష్ట్ర నలుమూలల నుండి బిసి నేతలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల జాతీయ అడ్జక్షుడు ,(తెలంగాణకు చెందిన) వైసిపి ఎంపీ, ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ .. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని స్థాయిలో బిసి ల సంక్షేమానికి కృషి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఇక సీఎం జగన్ తన ప్రసంగంలో.. .నాగరికతకు పట్టుకోమ్మ లు బీసీలు అని అభివర్ణించారు. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం . నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయం లో మీరు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కులాలు కాదని.. సమాజానికి వెన్నెముక కులాలు అని బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నా రు. ఈ దేశ సంస్కృతికి, సం ప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని అందుకే నేడు రాజ్యా ధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చాం . నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం . మరోవైపు అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా ఆదుకుం టున్నాం . చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చాం. చేయూత పథకం కింద రూ.14,110 కోట్లు అక్కా చెల్లెమ్మ లకు ఇచ్చాం .చంద్రబాబు ఒక్క బీసీని రాజ్య సభకు పంపించలేదు. బీసీలను ఓట్ల బ్యాంకుల వాడుకొని వదిలేసాడు. ఇన్ని మోసాలు చేసిన ఆయనకు ఇవే చివరి ఎన్నికలు.. ఆ విషయం ఆయనకే తెలిసిపోయింది. అని ఎద్దేవా చేసారు.
