సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో రాష్ట్రాల అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నా నేపథ్యంలో గుజరాత్ లో బీజేపీ గతం( 99 స్థానాలు లో విజయం) కంటే మరింత దూకుడుగా 145 స్థానాలవరకు ప్రస్తుత తాజా ( మధ్యాహ్నం 12 గంటలకు )సమాచారం మేరకు ముందంజలో ఉండి వరుసగా 7వ సారి అధికారంలోకి రావడానికి సిద్ధం అవుతుంది. ఇక ఉత్కంఠ రేపుతున్న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌లో సమీకరణం మారుతోంది. హోరాహోరీ పోరులో మధ్యాహ్నం 12గంటల సమయంలో బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35 కాగా 38 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. కాగా ఇప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 27 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. కాగా బీజేపీ అసలైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం 1-3 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్న స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవ్వొచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించింది. మరి ఫలితాలు ముగింపు సమయానికి సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *