సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గుజరాత్ లోను, ఇటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో బీజేపీ 156 స్థానాలలో గెల్చి ‘వార్ వన్ సైడ్ ‘గా చరిత్రను తిరగరాస్తూ వరుసగా 7వ సారి భారీ విజయాన్ని అందుకోగా, హిమాచల్ లో బీజేపీ ని అధికారంలోనుంచి దించి 40 సీట్ల భారీ గెలుపుతో కాం గ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక గుజరాత్ లో 5 సీట్లు సాధించి ఆప్ జాతీయ పార్టీ హోదా సాధించింది. దీనితో కేజ్రీవాల్ సంతోషం పట్టలేకపోతున్నారు. గుజరాత్ ఎన్ని కల్లో ఆప్ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని, అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఢిల్లీ , పంజాబ్ లో ఏమైతే చేశామో అలానే విలువలతో ప్రవర్తించాము అన్నారు.
