సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాండస్ తుఫాన్ తీరం దాటిన పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో పొలాలులో తడిసిన వరి పంటను జిల్లా వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు పరిశీలించారు. కాళ్ళ మండలం కోపల్లె, బొండాడ, ఆకివీడు పరిసర ప్రాంతాలలో పొలాలను పరిశీలించారు. పరిస్థితి సర్దుకొంటుందని , రైతులు భయపడవద్దని అయితే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని, ఇంకా కోతలు కోయని రైతులు రెండు రోజులు పాటు కోతలు ఆపాలని సూచించారు. రైతు భరోసా.. ధాన్యం కొనుగోలు సేకరణ ఏవిధంగా జరుగుతుందో సిబ్బందిని, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో రైతు మిల్లుకి ధాన్యాన్ని తోలుకుంటానంటే తేమశాతం ఎంత ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలో ధాన్యం లక్షా 60 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఆయన వెంట ఆకివీడు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కేఎస్‌ఎస్ శ్రీనివాస్, ఏవో జయవాసుకి, ఏడీ వెంకటేశ్వరరావు, ఏవో ప్రియాంక, ఆకివీడు రూరల్ బ్యాంకు కార్యదర్శి బాబు తదితరులు ఉన్నారు. తుఫాన్ కారణంగా ఏంతో కష్టపడి పండించిన వరి పంటను కాపాడుకోవడానికి రైతు కష్టాలు పడా ల్సి వస్తోందని, మరో ప్రక్క పండగలు వస్తున్నాయని ,రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలని, వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సూచించారు.
