సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నేడు, ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక 39వ వార్డులో రూ.43 లక్షల 82 వేల నిధులతో రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 36వ వార్డు ఆరేటి నగర్లో సర్వీస్ రిజర్వాయర్ నుంచి ఆరేటి నగర్ వరకు అక్కడ ప్రజలకు నాణ్యమైన మంచినీరు అందించేందుకు రూ.33 లక్షల 86 వేల నిధులతో నీటి పంపిణీ లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు నగరంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు. దుర్గాపురంలో నిర్మించిన రిజర్వాయర్‌ను త్వరలో అమృత పథకంలో ప్రజల వినియోగంలోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్లపై ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. అరేటినగర్ లో.. పాత పైపులైన్‌ను పూర్తిగా తీసివేసి కొత్తది ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో పూడిక తొలగింపునకు టెండర్లు కూడా పిలవనున్నారు. వార్డుల్లో పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఆదేశించారు. పేదల గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని, .విస్సా కోడేరు, గునుపూడి ఫ్లాట్ల లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు రెండు విద్యుత్ సబ్స్టేషన్లు కేటాయించగా రూ. 9 కోట్లు రెండు సబ్ స్టేషన్లకు రూ. 4.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని కార్పొరేషన్ దిశగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి వార్డును అభివృద్ధి చేశామన్నారు. అంతే కాకుండా ఇతర అభివృద్ధి పనుల కోసం,సుందరీకరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలుపంపామన్నారు. . అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చర్యలు చేపడతామన్నారు.
