సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : ఏలూరు నగరంలో ఈనెల 17వ తేదీన నిర్వహించు ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా దళితుల సమరభేరి ర్యాలీను జయప్రదం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి నేడు, మంగళవారం పిలుపునిచ్చారు. నేడు, మంగళవారం జిల్లా టిడిపి కార్యాలయంలో టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి సమరభేరి ర్యాలీ కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి దళితుల అభ్యున్నతి సంక్షేమానికై ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నారా చంద్రబాబు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా దళితుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి, గతంలో ఉన్న దళిత సంక్షేమ అభివృద్ధి పథకాలను రద్దు చేసి దళితులపై దాడులు హత్యలు, అత్యాచారాలు నిత్యం జరుగుచున్నందున దళితుల సమరభేరి ద్వారా దళితులంతా ఏకమై పోరాటం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *