సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : నేడు, మంగళవారం భీమవరం నుంచి కైకలూరు 52 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆ బస్సు పల్లెవాడ వచ్చే సరికి ఓ వ్యక్తి మోటారు సైకిల్‌పై ప్రక్క రోడ్డు నుండి ఊహించని రీతిలో ప్రధాన రోడ్డుపైకి రావడంతో బస్సు డ్రైవరు వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు తిప్పి సడన్‌ బ్రేక్‌ వేయడంతో.. ఆ బస్సు అక్కడే కాచుకొని ఉన్న చెరువు అంచుల వరకు వెళ్లి ఆగింది. కాస్త అదుపుతప్పితే చెరువులోకి వెళ్లిపోవడం ఖాయం. ప్రయాణికులు బ్రతుకుజీవుడా అంటూ ఊపిరి తీసుకొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *