సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలోని కొమరాడ అనాకోడేరు, ఈలంపూడి గ్రామాల్లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు,శనివారం మూడు గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి పలు సమస్యలను వివరించారు. విద్యుత్, మంచినీళ్ళు, రోడ్ల సదుపాయాల సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటిని కల్పించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ మూడు గ్రామాల సమస్యలను నెలరోజుల్లోగా పరిష్కరిస్తామని, సీసీ రోడ్లు, మంచినీళ్ళు, ట్రాన్స్ ఫార్మర్లు వేసి విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తామన్నారు. గ్రామస్తులు, నీటి సంఘం ప్రెసిడెంట్ గంజాల స్వామి నాయుడు, పల్లలరాజు, రావిరాజు, యర్రంశెట్టి కృష్ణ, రాట్నాల రాజ, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం, రాట్నాల సత్యనారాయణ, యర్రంశెట్టి లక్ష్మణ్, , మోకా శ్రీనివాస్, సుంకర పద్మజి, తదితరులు , మూడు గ్రామాల పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *