సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో తాజగా సీఎం ఆదేశాల మేరకు నేడు, బుధవారం (ఈ నెల 14వ తేదీన) ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో సాధికారత కమిటీ మరోసారి భేటీ అయ్యింది. నేటి రాత్రి వరకు సమీక్ష జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా వివిధకారణాలతో భారతదేశం నుండి ముఖ్యముగా ఆక్వా వ్యవసాయంలో అగ్రగామి అయిన ఏపీనుండి రొయ్యల ఎగుమతులు తగ్గుతున్నా యి. మరో పక్క మేత ధరలు పెరిగిపోతున్నా యి. ఈ సమయంలో ఆక్వా రైతూ ల ఆందోళనలతో స్వాందించిన, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆక్వారంగంలో ప్రముఖులతో , రైతు నేతలతో ప్రభుత్వ సీనియర్ మం త్రులతో ఆక్వా సాధికారత కమిటీని నియమించారు. ఈ కమిటీ నిర్ణయాలు మేరకు రెండుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కం పెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇటీవల టన్ను కు రూ.2,600 చొప్పున పెంచగా, సీఎం ఆదేశాలతో సాధికారత కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. ఫలితంగా పెంచిన ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇది రైతులకు చాలా మేలు చేసింది. ఇటీవల భీమవరం ఉండి రోడ్డులో పంక్షన్ హాలులో జరిగిన కీలక సమావేశం జరిగిన నేపథ్యంలో కొత్త నిర్ణయాలు కు ప్రతిపాదనలు వెళ్లాయి. నెల రోజులుగా ప్రభుత్వ నిర్ణయ ధరకే కొనుగోలు చేసేలా ప్రాసెసింగ్ యూనిట్లతోనూ మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. రొయ్య రైతులకు గిట్టుబాటు అయ్యే లా ఇరుపక్షాలకు ఆమోదయోగ్య మైన రీతిలో ధరలను నిర్ణయించారు. కేజీకి వచ్చి 100 కౌంట్ రొయ్య లను రూ.210కు, 30 కౌంట్ రూ.380కుతక్కువ కాకుండా కొనాలని కమిటీ ఆదేశాలు జారీ చేశారు. గత నెల రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలు అయ్యాయని ఫలితం గా ఇంతటి తీవ్ర సంక్షోభ సమయం లో కూడా దేశంలో మరెక్కడా లేనివిధంగా ఒక్క ఏపీలోనే రొయ్యల ధరలు నిలకడగా ఉన్నాయి. అని అధికారులు అంటున్నారు, ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు, మార్కెట్లో రేట్లనుసమీక్షించేందుకు ప్రత్యే క యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
