సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ప్రకటించారు. తనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలో చేసిన కస్టోడియల్ టార్చర్‌పై తనకి ఇప్పటికి నాయ్యం జరగలేదని, దీనిపై లోక్ సభలో కూడా చాలాసార్లు ప్రస్తావించానని అయినప్పటికీ తనను టార్చెర్ చేసిన అధికారులను పార్లమెంట్ ప్రివిలైజ్ కమిటీ విచారణకు ఇంకా అధికారులను పిలవలేదని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. తనను ఎవరు కొట్టారో ఇంకా విచారణ జరపలేదని, త్వరగా విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. తనను కొట్టింది సునీల్ కుమార్ అని, ఆ వీడియోను చూసి ఆనందించింది సీఎం జగన్ అని, ఆరోపిస్తూ దీని వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణాలో బండి సంజయ్ ఫై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే వారిని వెంటనే పార్లమెంట్ కమిటీ విచారించిందని కానీ తన విషయంలో ఆలస్యం జరుగుతుందని వాపోయారు. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలోనే నిజమైన నాయ్యం జరుగుతుందని చంద్రబాబు అంటారని తన విషయంలోను అదే వర్తిస్తుందనిపిస్తుందన్నారు.ఇటీవల ఏపీలో అవినీతి విరామ పథకం సీఎం జగన్ వలనే అయిందని, అవినీతి చేయొద్దని.. కొద్ది రోజులు ఆపాలని మంత్రులకు సలహాలు ఇచ్చారని రఘురామ అన్నారు. వైసిపి లో ప్రముఖులు ఉద్యమంలా ల్యాండ్, ఇసుక, వైన్, మైన్ అన్నింటా దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో ఎంతోమంది భవన కార్మికులు మట్టిలో కొట్టుకుపోయారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *