సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, ఉండి నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులు చిలుకూరి నర్సింహారాజు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ తో పాటు రాజకీయాలకు అతీతంగా శ్రేయోభిలాషులు నేడు, శుక్రవారం భీమవరం లో సందడిగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ఆయనకు శాలువాకప్పి బొకే అందించి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని వారి మధ్య సన్నిహిత చాటుకొన్నారు. కొద్దీ కాలం క్రితం వరకు చిలుకూరి నర్సింహారాజు అనారోగ్యం తో హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందటం అప్పుడు కూడా మండలి చైర్మెన్ మోషేను రాజు అక్కడికి వెళ్లి ఆయనను త్వరగా కోలుకోవాలని పరామర్శించడం. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం తో చిలుకూరి నర్సింహారాజు ఆయన సన్నిహితులతో కలసి నేడు జన్మదినం జరుపుకోవడం గమనార్హం..
