సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: “ప్రతి ఇంటికి మన ప్రభుత్వం” కార్యక్రమం లో భాగంగా నేడు, సోమవారం (19.12.2022) ఉదయం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆయా కుటుంబాలు పొందిన లబ్ది వివరించే కార్యక్రమం చేపట్టారు. యనమదురు గ్రామానికి ఈ 3న్నర ఏళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధి , నూతన రోడ్డులు ,నాడు నేడు క్రింద స్కూల్స్ అభివృద్ధి , త్రాగునీరు తదితర అంశాలపై తాను చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించి వారి ఇతర సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని , అక్కడే ఉన్న అధికారులకు పలు ప్రతిపాదనలపై ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామా ప్రజలు, వైసిపి నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
