సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బాపట్ల జిల్లా లో నేడు, బుధవారం పర్యటిస్తూ సీఎం జగన్ తన పుట్టినరోజు వేడుకలు యడ్లపల్లి గ్రామంలో విద్యార్థుల మధ్య జరుపుకొన్నారు, ఆ గ్రామా ప్రజలు ఆయనకు దారిపొడవునా పూలు జల్లుతూ మహిళలు హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మం డలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల వేదికపై నుండి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎనిమిదో తరగతి విద్యా ర్థులకు బైజుస్ కంటెంట్ ఉన్న టాబ్ ల పంపిణి ప్రారంభించారు. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలని భవిషత్తు లో ఉన్నత స్థానాలలో ఉండాలని ముందుచూపుతో ఖర్చుకు వెనకాడకుండా రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచిత పం పిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో బైజూస్ లెర్నింగ్ లో లెక్క లు, ఫిజిక్స్ , జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్ , హిస్టరీ పాఠ్యాంశాలు, ఇంకా తెలుగు ఇంగ్లీష్ హిం దీతో పాటు దాదాపు 8 భాషల్లోపాఠ్యాం శాలు, ఇంకా విద్యా ర్థులకు అర్థమయ్యే లా సుమారు 2 నుం చి 4 నిమిషాల నిడివితోయానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్లో మొత్తం 57 చాప్టర్లు‍300 వీడియోలు ఉంటాయని ప్రకటించారు. ఈ టాబ్ ల వినియోగంపై పై విద్యార్థులు, ఉపాధ్యా యులకు ఇప్ప టికే ఐటీ విభాగం అవగాహన కల్పించిందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *