సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చైనాలో మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద గంటికలు మ్రోగిస్తుంది. దీనితో ప్రపంచ దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. గతంలో ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. ఇటీవల ఉగ్ర రూపం దాల్చిన కరోనా దెబ్బకు ప్రతిరోజు వందల మంది చనిపోతున్నారు. చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆస్ప త్రుల్లోరోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మ శాన వాటికల్లోశవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. శ్శానవాటికల్లోఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. అంటూ విదేశీ మీడియా కంగారు పడుతుంటే.. చైనా దేశంలో అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల గత మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ నేడు బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొనడంపై ప్రపంచం నివ్వెరపోతుంది. గత సోమవారం కేవలం ఐదుగురే మరణించారని చైనా పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. గత మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *