సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేడు, బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫుడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీలో మంటలు భగ్గుమన్నాయి. అక్కడ సాల్వెంట్ ఆయిల్ ట్యాంక్ పేలడంతో సాల్వెంట్ ఆయిల్(SF 1) ప్లాంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నారు. నలుగురిని సహాయక సిబ్బంది రక్షించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొండవీటి చరణ్, తలారి దుర్గాప్రసాద్, కోనా నాగబాబులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారని సమాచారం. జగన్నాథపురానికి చెందిన కార్మికుడి ఆచూకీ గల్లంతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇది తాజా పరిస్థితి.. ఇంకా పూర్తీ వివరాలు అందవలసి ఉంది.
