సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో మరోసారి తెలుగు దేశం అదృష్టం పరిశీలించుకొంటుంది. నేటి బుధవారం ఖమ్మం జిల్లా నుండి తెలుగు దేశం అధినేత చంద్రబాబు తన ప్రచారం ప్రారంభించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బయల్దేరిన చంద్రబాబు ముందుగా కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో తానే ముందుచూపుతో ఐటీ స్థాపించామని చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా ?అని అందరు తనను ఎగతాళి చేశారని.. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదని, ఇదే దర్సకత తో పట్టుదలతో తెలంగాణను అభివృద్ధి చేసానని మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. నేటి సాయంత్రం .ఖమ్మం లోని సర్దార్ పటేల్ మైదానం వేదికగా నేటి రాత్రి ‘తెలుగు దేశం పార్టీ శం ఖారావం ’ బహిరంగ సభ లో చంద్రబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *