సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైసిపి అంటూ YS షర్మిల దూసుకొనివచ్చేయడం వై ఎస్ అభిమానుల ను ఓట్లను తమవైపు తీర్పుకోనే పనిలో ఉండగా .. మరోవైపు చంద్రబాబు నేను కూడా రెడీ అంటూ .. తెలంగాణ రాష్ట్రంలో గత రాత్రి ఖమ్మంలో బహిరంగ సభ కు ఇంతకాలం నాయకుడు లేక సబ్డుగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలిరావడంతో.. చంద్రబాబు మంచి జోష్ తో తెలంగాణాలో తెలుగుదేశం లేదన్నవారికి ఇదే సమాధానం అన్నారు. దీనితో అధికార బిఆర్ ఎస్ (టీఆరెస్) నేతలకు ఆగ్రహం పెల్లుబికుతుంది. దీనితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం ఇక పనిచేయదని , చుక్కలు ఎన్ని ఉన్న తెలంగాణ చంద్రుడు కేవలం కెసిఆర్ మాత్రమేనని, బీజేపీ తో పొత్తుకోసం చంద్రబాబు కొత్త డ్రామా అని కొట్టిపారేశారు. ఇక మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో.. చంద్రబాబు మోసగాడని, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నపుడు తెలంగాణలో అందరిని మోసం చేసారని , తరువాత అక్కడ ఆంధ్ర వారికీ దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథానా తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని .. ఇప్పడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని అందుకే తెలంగాణాలో హడావిడి చేసి తన ఉనికి ఉన్నట్లు బీజేపీ కి భ్రమ కల్పిస్తున్నాడని విమర్శించారు.
