సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు పరిపాలన చేసినట్లు పురాణాలూ పేర్కొన్న గుజరాత్ ని ద్వారకా నగరం లో ‘దేవ భూమి ద్వారకా కారిడార్’ లో ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మించబోతున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో వందలాది అడుగుల శ్రీ కృష్ణ విగ్రహం నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు .. ఈ నిర్మాణంలో శ్రీమద్ భగవత్ గీత 3డీ అనుభూతిని ఏర్పాటు చేయబోతున్న ట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మం త్రి రుషికేశ్ పటేల్ ప్రకటించారు. ఇప్పటికే వేల కోట్ల ఖర్చుతో సర్ధార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహంతో ప్రపంచ రికార్డు నమోదు చేసిన గుజరాత్ ఇప్పుడు శ్రీ కృష్ణ విగ్రహం తో మరోసారి చరిత్ర సృష్టించనుంది. up file photo
