సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమాలలోనవరస నటన సార్వభౌమ .. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) నేడు, శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‎లో తీవ్ర విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు. తెలుగులో 777 సినిమాలలో నటించిన సత్యనారాయణ హిందీలో సుభాష్ గయి , దిలీప్ కుమార్, అనిల్ కపూర్ లతో కర్మ, ఇంకా పలు సినిమాలో కీలక రోల్ లో ఉత్తరాదివారిని కూడా అలరించారు. తెలుగులో సినీ నిర్మాతగా, స్వర్గీయ ఎస్వీ రంగారావు తరువాత పురాణాలూ, జానపదాలు ,సాంఘిక, కౌ భాయి పాత్రలవరకు అన్ని తరహా పాత్రలను అవలీలగా చేసే నటుడిగా గౌరవం పొందారు. యమగోల సినిమా నుండి యమలీల, పిట్టల దొర, తదితర ఎన్నో సినిమాలలో యమధర్మరాజు గా అదరగొట్టారు మహేష్ బాబు తో మహర్షి ఆయన చివరి చిత్రం. మచిలీపట్టణం నుండి ఎంపీగా కూడా పనిచేసారు. ఆయన మృతికి సినీ పరిశ్రమతో పాటు సీఎంలు జగన్, కెసిఆర్ లు తీవ్ర సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *