సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2022 ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు 1200 కోట్ల మార్క్ దాటిన RRR, 350 కోట్లు దాటిన పుష్ప, 200 కోట్లు కలెక్షన్స్ దాటిన కార్తికేయ2, సీతారామం, మేజర్ సూపర్ హిట్స్ తో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి రెట్టింపు అయ్యింది. బాలయ్య నటించిన అఖండ, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2021 చివరలో విడుదలయి 2022 సంక్రాంతి వరకు తన ప్రభంజనాన్ని కొనసాగించి కరోనా తరువాత సినిమా హాళ్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక అక్కినేని నాగార్జున ఈ ఏడాదిమూడు సినిమాల్లో కనిపించారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఆంధ్ర లో పర్వాలేదు.. కానీ తెలంగాణలో ప్లాప్ అయ్యింది. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమా మెప్పించలేకపోయింది. ఇక బాలీవుడ్లో ‘బ్రహాస్త్ర’లో కీలక పాత్రతో నాగ్ తన మార్క్ పాన్ ఇండియా లో మెరిశారు. ఇక చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది విడుదలైంది. అయితే డిజాస్టర్ గా మిగిలింది. ఇక సాల్మన్ ఖాన్ తో కలసి చిరంజీవి . మోహన్‌రాజా డైరెక్షన్లో వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ కూడా యావరేజ్ గా నిలచింది. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ఈ ఏడాది విక్టరీ వెంకటేశ్ ‘ఎఫ్3’తో మరోసారి మంచి హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో అవలీలగా చేరిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట తో మరోసారి 200 కోట్ల క్లబ్ లో చేరారు. ఇటీవల విడుదలైన ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్లో మెరిసి విజయం సాధించారు.డార్లింగ్ ప్రబాస్ రాదే శ్యాం సినిమా మ్యూజికల్ హిట్ అయిన ప్లాప్ గా నిలచింది. హీరో రవితేజ. ఆయన నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ నెల 23న విడుదలైన ‘ధమాకా’ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే తెచ్చుకుంది.ఇక ‘ఖిలాడి’, శరత్ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. పవర్ స్టార్ పవన్ తో రానా విలన్‌గా నటించిన ‘భీమ్లా నాయక్’ పర్వాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబి సారా 50కోట్ల కలెక్షన్స్ సాధించి అందరిని నివ్వెరపరిచింది..ఇక విశ్వక్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ఓరిదేవుడా హిట్స్ అయ్యాయి.‘మేజర్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అడివి శేష్. హిట్ 2 తో మరో హిట్ కొట్టారు.నాని నటించిన సుందరానికి తొందర.. యావరేజ్ గా నిలచింది. కార్తికేయ తరువాత నిఖిల్ నటిచిఇన ‘18 పేజేస్’ ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.సాయి కుమార్ SR కల్యాణమండపం హిట్ గా నిలచింది. చాల పరాజయాలు ఉన్నపటికీ మొత్తానికి 2022 తెలుగు సినిమాకు మంచి చేసింది. డబ్బింగ్ సినిమాలు కాంతారా, కెజిఫ్ 2, బ్రహ్మస్త్ర, కమల్ హాసన్ విక్రమ్, విక్రమ్ PS1 , విజయాలు సాధించాయి
