సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేడు, సోమవారం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. రేపు తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని తన అనుచరులతో ఆస్పత్రికి వచ్చారు. అయితే అదే సమయంలో పాలకొల్లు లో నిరాహార దీక్ష కు పూనుకున్న కాపు నేత మాజీ ఎంపీ హరిరామజోగయ్య ను ఏలూరు ఆసుపత్రి కి తరలించి అక్కడే ఉంచడం , ఆయనను పరామర్శించి జనాన్ని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో..చింతమనేని ఆస్పత్రికి వచ్చారన్న అనుమానంతో లోపలకు వెళ్లకుండా గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు. తరువాత ఆయన చిరిగిపోయిన చొక్కాతో మద్యాహ్నం అమరావతి లోని టీడీపీ కార్యాలయానికి వచ్చి తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ అమరావతి కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలందరినీ టార్గెట్ చేసిందన్నారు. రేపు అధికారంలోకి రాబోయేది టీడీపీయేనని చింతమనేని ప్రబాకర్ ఆశాభావం ప్రకటించారు.
