సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్, స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు ప్రధమ వర్ధంతి సందర్భముగా నేడు, బుధవారం స్థానిక గ్రంధి వెంకటేశ్వర రావు డైలీ మార్కెట్ వద్ద ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులు, పట్టాణ ప్రముఖులు, ఆయన విగ్రహానికి పుష్ప మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ.. రాజకీయాలలో ముక్కు సూటిగా వ్యవహరించి,ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లుగా మొఖం మీద మాట్లాడిన నాయకుడు.ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి అండగా నిలిచిన నాయకుడు,రాజకీయాలలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి, భీమవరం పట్టణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మున్సిపల్ మాజీ చైర్మన్, సేవాతత్పరుడు,అని కొనియాడారు. కీర్తిశేషులు, గ్రంధి వెంకటేశ్వరరావు (GVR) ప్రథమ వర్ధంతి సంధర్భంగావైసిపి అభిమానులు నిర్వహించిన అన్నసమారాధన, పేదలకు వస్త్ర దానం పలు సేవా కార్యక్రమాల్లో గ్రంధి వెంకటేశ్వర రావు కుమారుడు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వయంగా పాల్గొనడం జరిగింది.
