సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో భాగం మీడియా తో మాట్లాడుతూ..కుప్పంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించ తలపెట్టగా, వాహనాలను సీజ్ చేయడం దారుణం అని, రాష్ట్ర పోలీసులు ఇంకెన్ని తమాషాలు చేస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడుని కూడా అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నారని అరెస్టు చేస్తారేమోనని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు బ్రిటిష్ వారితో జరిపిన స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం రాష్ట్ర ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజలకు స్వాతంత్రం లేదు.. భావ స్వేచ్ఛ ప్రకటన అనేది లేదని విమర్శించారు. రేపు ప్రజల మాట్లాడుకునే హక్కును కూడా తొలగిస్తామని అంటారేమో. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే గొడవలు జరుగుతాయని, ఘర్షణలు జరిగి చంపుకుంటారని అంటారేమో? రేపు మాటలను నిషేధించరన్న గ్యారెంటీమీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్ర ఏపీ రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదు. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో అయితే సభలు సమావేశాలకు అనుమతి ఇస్తారట. అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు దరఖాస్తు చేసుకుంటే మాత్రం అనుమతి ఇస్తారేమోనని? ఎంపీ రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. చీకటి జీవో ద్వారా సీఎం జగన్ , సజ్జల రామకృష్ణారెడ్డి లు పోలీసుల అధికారాలను హరించారు అని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *