సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్స్ ను విడుదల చేసారు. దీనికోసం పార్టీలో ఉన్న యువత తమ ఆలోచనలను ఈనెల 5 నుంచి 8 వరకు 80699 32222కు తెలియజేయవచ్చునని అన్నారు. ఈ ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల పెన్షన్ లను ఈ జనవరి ఒకటిన తొలగించిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారి కన్నా చెత్త గా జగన్ పాలన సాగుతుందని, రోడ్ షోలు, బహిరంగ సభలు నిషేదమంటూ, మీడియా వారిపై నిషేధం అంటూ జగన్ పాలన సాగుతుందని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన యువశక్తి కార్యక్రమానికి వెళ్తామని అన్నారు. కెసిఆర్ పెట్టిన బిఆర్ఎస్ పార్టీతో ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నారు. పట్టణ అధ్యక్షులు చెన్నమిల్లి చంద్రశేఖర్, మల్లినీడి తిరుమలరావు మాట్లాడుతూ.. 175 కు 175 రావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో 151 పక్కన 1 పోయి 15 సిట్లకే పరిమితమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల వెంకట సుబ్బారావు, బండి రమేష్ కుమార్, మోకా శ్రీనివాస్, సుంకర రవి, వీరవాసరం మండల ఎంపీటీసీ లు గుండుపల్లి విజయలక్ష్మి, కందుకూరి వెంకటలక్ష్మి, వార్డు మెంబర్ ఆకులు మౌనిక బలవంత ఎంపీటీసీ తాతపూడి రాంబాబు,తుందూరు ఎంపీటీసీ వాసు, వెండ్ర వెంకట లీలా కృష్ణ, సాయి, తిరుమల యామిని దేవి, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, నాయకులు అకుల శ్రీను, త్రివిక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *