సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: 6-1-2023, ఇటీవల కాలంలో ఏలూరు టూటౌన్ ప్రాంతంలో ఏకంగా 11ఇళ్ల తాళాలు బ్రద్దలు కొట్టి వరుస చోరీలకు పాల్పడిన ఘరాన దొంగను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి రూ. 10 లక్షల విలువైన బంగారు నగలు స్వా ధీనం చేసుకున్నారు. ఏలూరులో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో సమావేశంలో .. హనుమాన్ జంక్షన్ సమీపంలో తాజగా పోలీసులకు పట్టుపడిన దొంగ రాకేష్ అలియాస్ రాఖీ అని, ఇతను పాత నేరస్తుడే అని, తెలంగాణ జగిత్యాల కు చెందినవాడని, అయితే గోదావరి జిల్లాలలో దొంగతనాలు చేస్తుంటాడని, గతంలో మరో ముగ్గురితో కలసి భీమవరం, తాడేపల్లిగూడెం ,రాజమండ్రి కాకినాడలలో ఏకంగా 18 దొంగతనాలు చేసి అరెస్టు అయ్యాడు. జైలుకు వెళ్లి ఎనిమిది నెలల కిందట బయటకు వచ్చాడు. కొంతకాలం నుంచి రాజోలు మండలం చింతపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఎక్కువ మందితో కలిసి దొంగతనాలు చేస్తే దొరికిపోతున్నామని భావిం చి ఈసారి ఒక్కడే దొంగతనాలు చేస్తున్నాడు. గత 4 నెలలలో ఏలూరు లో 11,పాయకరావుపేటల్లో 2దొం గతనాలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్దనుండి మొత్తం 25 కాసుల బంగారు నగలు, ఒక మొబైల్ ఫోన్ , రూ.9 వేలనగదు స్వా ధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడం లో నైపుణ్యం చూపిన సీసీఎస్ సీఐ మురళీకృ ష్ణ, సీసీఎస్, టూటౌన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
