సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాజస్థాన్, బీహార్ , ఝార్ఖండ్ రాష్ట్రాలలో తమ పవిత్ర మందిరాలు ఉన్నాయని వాటిని కేంద్రం పర్యాటక ప్రాంతాలుగా ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జైనులు పురుషులు, స్త్రీలు కూడా రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న నేపథ్యంలో నేడు, శుక్రవారం భీమవరంలో కూడా నిరసన ర్యాలీ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఆయన కార్యాలయం వద్ద కల్సి తమకు మద్దతు ప్రకటించాలని కోరారు. వారి వివరణ ప్రకారం ఉదాహరణకు .. జైనుల ప్రాచీన తీర్థమైన శికార్జి తీర్థాన్ని ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. ఇది జైనులకు అత్యంత పవిత్ర తీర్థయాత్ర స్థలం దీనిని టూరిస్ట్ ప్రాంతంగా ప్రకటిస్తే మందు,మాంసం వంటి పదార్థాలతో అపవిత్రమవుతుందని, అది తమ పవిత్రతకు ఇబ్బందులు తెస్తుందని వివరించారు. దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ .. దేశంలో అన్ని మతాలు ప్రార్ధన మందిరాల విషయంలో వారి నమ్మకాలను అందరు గౌరవించాలని వారికీ మద్దతుగా దేశంలో ఒక ప్రజా ప్రతినిధిగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *