సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో సంక్రాంతి సంబరాలు వారం రోజులు ముందుగానే మొదలయ్యాయి. ఎక్కడ చుసిన స్వచ్చంధ సంస్థలు, విద్య సంస్థలు భారీ స్థాయిలో సాంప్రదాయ తెలుగుదనాన్ని, పల్లె సంస్కృతి ప్రతిబింబించేలా పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఆదివారం ఉదయం భారతీయ విద్యా భవన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మేలు జాతి దేశీ ఆవుల ఎంపిక , అధిక పాలు దిగుబడి ఇచ్చే పశువుల పోటీలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు హాజరయ్యి పశువుల వివరాలు ను వాటి యజమానులు ను అడిగితెలుసుకొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన భారతీయ విద్యా భవన్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ రైతులకు ప్రోత్సాహకంగా వుంటాయని ఆయన అన్నారు
