సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గునుపూడి ,పంచారామ క్షేత్రంలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థణ స్వామి వార్లదేవస్థానం నందు కనుమ పండుగ సందర్బముగా గోపూజా కార్యక్రమం నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమం నందు గోవులకు అర్చకులతో పవిత్ర పూజ నిర్వహించి వాటికీ ఇష్టమైన ఆహార పదార్ధాలు అందించడం జరిగింది. ధర్మకర్తల మండలి అడ్జక్షురాలు కోడే విజయ లక్ష్మి మరియు ధర్మకర్తలు పాల్గొనటమైనది. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి ఎం అరుణ్ కుమార్ పాల్గొనడం జరిగింది.
