సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ ఎన్నో అవాంతరాలు దాటుకొని ఎన్నికలు ముగిసాక నేడు, గురువారం తమిళ తెలుగు బాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా రాజకీయ అంశాలు చేర్చి తెరకెక్కిన ఈ సినిమా ను దర్శకుడు హెచ్. వినోద్ రూపొందించారు. కధ విషయానికి వస్తే.. వెట్రి కొండన్ (విజయ్) గిరిజన గ్రామం నుంచి వచ్చిన పోలీస్‌ ఆఫీసర్. అవినీతి, అక్రమాలను చీల్చిచండాడే నిజాయితీ పరుడు. అయితే కొందరి కుట్ర వల్ల జైలు పాలవుతాడు. జైలులో ఉండగానే ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడిని అడ్డుకుంటాడు. దాంతో జైలర్ (గౌతమ్ వాసుదేవ మీనన్)కు అతని పట్ల సానుభూతి కలుగుతుంది.యాక్సిడెంట్‌లో చనిపోయే ముందు జైలర్ తన కూతురు విజ్జీ (మమితా బైజు)ని ఆర్మీ ఆఫీసర్ చేయమని వెట్రీ చేతిలో పెట్టి కన్నుమూస్తాడు. అయితే అధికారం కోసం ఎంతటి దుర్మార్గం అయినా చేసే రోజా రంగస్వామి (ప్రకాశ్‌ రాజ్‌),మరో దుర్మార్గుడైన హెమ్లర్ (బాబీ డియోల్)తో కలిసి ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? ప్రకాశ్‌ రాజ్ తో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలే అధికారాన్ని మార్చి మార్చి పొంది, మూడో పార్టీకి ప్రజలను దోచుకునే ఆస్కారమే ఇవ్వడం లేదని చెప్పించారు..దానిని వెట్రీ ఎలా ఎదుర్కొన్నాడు?చివరకు రాష్ట్రాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో విడదీసి పబ్బం గడుపుకోవాలనే రాజకీయ నాయకులకు చురక అంటించే ప్రయత్నం చేసారు. ఇక సినిమా తెలుగు వారికీ కనెక్ట్ కాదు కానీ తమిళనాడు బాగా కనెక్ట్ అవుతుంది. హీరో విజయ్ తనదయిన వన్ మాన్ ఆర్మీ నటన ప్రదర్శించాడు. న్యూస్ రిపోర్టర్ గా పూజ హేగ్డే పాత్ర నిడివి తక్కువ. పాటలు తమిళ వాసన.. నటీనటులు అందరు తమవంతు బాగా చేసారు. అనేక అతిధి పాత్రలలో సినీ ప్రముఖులు కనిపిస్తారు.3గంటల పైగా నిడివి కాస్త ఇబ్బందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *