సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర స్థాయి యుద్ధం జరుగుతున్నా నేపథ్యంలో గత బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు గురువారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 95 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు విదేశీ మదుపర్లు గత బుధవారం రూ.819 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.51గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి గత సెషన్ ముగింపు (76,755)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయిట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ సాయంత్రానికి 376 పాయింట్స్ తో 76,378 వద్ద ముగిసింది, . మరో వైపు నిఫ్టీ కూడా నేటి సాయంత్రానికి 126పాయింట్ల నష్టంతో 23,869 వద్ద ముగిసింది.సెన్సెక్స్, నిఫ్టీలో ఫోర్స్ మోటార్స్, నాల్కో, వేదాంత, ఆయిల్ ఇండియా, నవుమా వెల్త్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి
