సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా మీడియా లో ఈ ఉద్యమ దృశ్యాలు హల్ చల్ అవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు వీడియో ఫుటేజ్ లు ఆధారంగా ఉద్యమంలో పాల్గొన్న యువత పాస్ పోర్ట్ ల సమాచారం తీసుకొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రఖ్యాత సంఘ ఉద్యమ కారుడు. మితవాది , అన్న హజారే నేడు, గురువారం విద్యార్థుల ఉద్యమానికి తన మద్దతును ప్రకటించడం సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో రేపు విద్యార్థి సంఘాలు విద్య సంస్థల బంద్ కు పిలుపు నిచ్చాయి. ఉద్యమం లో కొన్ని అరాచక శక్తులు ప్రవేశించాయని భావిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు, అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఢిల్లీ లోని వ్యాపార కేంద్రమైన కన్నాట్‌ ప్లేస్ ప్రాంతంలోని అన్ని దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలను గురువారం సాయంత్రం 6:30 గంటలకల్లా పూర్తిగా మూసివేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వ్యాపారులను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *