సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మనిషి మద్యం త్రాగి మృగం లా మారితే ఎంతటి దారుణం చేయగలడో? ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరులో గత సోమవారం రాత్రి ఈ ఘటన జరుగగా తాజగా వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలను హతమార్చా లనే దురాలోచనతో వారు నిద్రిస్తున్నగదిలో పెట్రోలు పోసి నిప్పంటించాడు ఓ మృగం.. సకాలం లో అప్రమత్తం కావడంతో తల్లీపిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు.( ఫై చిత్రంలో చూడవచ్చు) పోలీసులు, బాధితురాలి వివరణ ప్రకారం.. తానింకి సురేష్, కౌసల్య లకు ఇద్దరు పిల్లలు. కూలిపనులు చేసుకొనే సురేష్ తరచూ మద్యం తాగివచ్చి భార్యను కొట్టడం చేసేవాడు. అయితే సోమవారం రాత్రి సురేష్ మద్యం తాగివచ్చి కొద్దిసేపు కేకలు వేసి బయటకు వెళ్లిపోయాడు. తరువాత అర్ధరాత్రి తిరిగి వచ్చి ఇంటి తలుపు బయట గడియపెట్టి గది లోపలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.. అప్పటికే కుమార్తె హేమశ్రీ, కుమారుడు అభిలాష్ తో కలిసి కౌసల్య ఇంట్లో పడుకొన్నారు. ఇంతలో వారి అరుపులకు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని రక్షించారు..అప్పటికే. ఆమె కాళ్లు, చేతులు స్వల్పంగా కాలిపోయాయి. అయితే సురక్షితంగా బయట పడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రి కి చేర్చారు. నిందితుడిని నిన్న మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *