సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇకపై పదిహేను సంవత్సరాలు సర్వీస్ దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1నుంచి తుక్కు గా పరిగణిస్తామని,కేంద్ర రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖ తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1నుండి వాటి రిజిస్ట్రేషన్లను ఉపసం హరించనున్నా రు. అయితే శాంతి భద్రతలు, రక్షణ రంగం మినహా, ట్రాన్స్ పోర్ట్, కార్పొ రేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ‘‘ప్రాథమిక రిజిస్ట్రేషన్ నమోదై 15 ఏళ్లు సర్వీస్ పూర్తయిన వాహనాలను వదిలించుకోవాలి. వాటిని చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలి’’ అని ఆ ఉత్తుర్వుల్లో తెలిపింది. ఈ కొత్త పాలసీ ప్రకారం పాత వాహనాలను తుక్కు గా మార్చి న తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలనిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
