సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇం తవరకూ కిలోకి రూపాయి తీసుకునేవారు. ఇక నుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇకపై ప్రతి నెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితం గా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుదారులకు కుటుంబ సభ్యుల సంఖ్యా బట్టి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రేషన్ బియ్యా న్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక నుంచి సంవత్సరం పాటు పూర్తీ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ వాహనాలు ద్వారా అందించే పంచదార, కం దిపప్పు కు మాత్రమే డబ్బులు తీసుకోనున్నారు. కేజీ కందిపప్పు కు రూ.67, అరకిలో పంచదారకు రూ.17 తీసుకోవాలని, ఆదేశించారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో 1011 రేషన్ దుకాణాల ద్వారా 343 రేషన్ వాహనాలు కార్డుదారుల ఇంటి వద్దకే బియ్యాన్ని తీసుకువెళ్ళి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వంచర్యలు తీసుకుంది. పశ్చి మగోదావరి జిల్లాలో 5,36,423 కార్డులకు గాను 15,06,921 మంది ప్రజలకు ఒక్కొక్క రికి 5 కేజీల చొప్పున అందిస్తున్నా రు. ఏలూరు జిల్లాలో 1,164 రేషన్ దుకాణాల ద్వారా 408 రేషన్ వాహనాలు, ఉచిత బియ్యం పంపిణి చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *