సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాకేంద్రం భీమవరంలో ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తు న్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వర్మ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భీమవరం లోని స్థానిక జేపీ రోడులోని ఆనంద ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేస్తు న్నామని, కేంద్ర మంత్రులతో పాటు, బీజేపీ అగ్రనేతలు తో కలపి సుమారు 400 మంది ఆహ్వానితులు పాల్గొంటారని వివరించారు. భవిషత్తు రాజకీయాలకు సంబంధించి ఈ సమావేశాల్లో బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్ర సమావేశాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో భీమవరంలో 4 దపాలు రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేశామని ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ , కోమటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
