సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, శనివారం స్థానిక భక్తులు కోలా నాగ రమేష్ స్నేహ దంపతులు 8 గ్రాముల బంగారం కానుక గా అందచేసినారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల వెంకట రామారావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 4 రోజులుగా ఉదయం పూటా కూడా భక్తుల సంఖ్యా విపరీతంగా పెరిగింది. ఇక నేటి సాయంత్రం 5గంటలకు కళావేదికపై నిర్వహించిన కూచిపూడి నృత్యము ఆహుతులను ఆకట్టుకొంది. ఇక నేటి సాయంత్రం 6 గంటలకు స్వర తరంగిణి ‘ సినీ మ్యూజికల్ నైట్’ ఆహుతులను అలరిస్తుంది. నేటి రాత్రి 8 గంటలకు గుంటూరు వారిచే ‘వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర’ నాటకం’ప్రదర్శించనున్నారు. రేపు ఆదివారం, సాయంత్రం 5గంటలకు భీమవరం వారిచే కూచిపూడి నృత్యం రాత్రి 7 గంటలకుశ్రీ మావుళ్ళమ్మవారి నాట్యమండలి.. అందరు మహిళలతో ‘ సత్య హరిచంద్ర’ నాటకం ప్రదర్శన ఉంటుంది.
