సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని తమ ఎన్నికల రధం ‘వారాహి’ కి ప్రత్యేక పూజలు చేయించారు. అయితే గత మంగళవారం రాత్రి తెలంగాణ లోని ధర్మపురిలో పూజల అనంతరం పవన్ కల్యా ణ్ వాహనశ్రేణి గత ఏడో నెంబరు రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తుండగా జరిగిన అపశ్రుతి లో ఒక యువకుడు మరణించడం మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కావడం విషాదం నింపింది. చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి ని అనుసరిస్తున్న పవన్ అభిమానులైన కూస రాజ్ కుమార్ (20),జక్కు ల అంజి బైక్ ఫై వేగంగా అనుసరిస్తూ కిష్ణ రావు వద్ద ఎదురుగా వస్తున్న బైకు ను మరో , కారును ఢీకొట్టారు. ప్రమాదం లో రాజ్ కుమార్ వెంటనే మృతి చెందాడు. అం జికి, ఎదురుగా ద్వి చక్ర వాహనం పై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, నీలం సాగర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *