సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు బుధవారం ( జనవరి 25న )కూడా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని ఆరా తీస్తూ తన పర్యటన కొనసాగించారు. స్థానిక యువకులు రాజకీయాలకు అతీతంగా ఆయనకు తోడుగా నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేశారన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఏటా రూ.13,500 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందిస్తూ , కాపు మహిళలకు సైతం ఏడాదికి 15 వేల రూపాయలు చప్పున అందిస్తున్నారని , దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 656 సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు వాటర్ లైఫ్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని భీమవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు మించి అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా మన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు 8 నుంచి 10వ తరగతి వరకు 30 వేల విలువైన ట్యాబ్‌లను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఇంటికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామాల్లోని సమస్యలను పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశాలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారానికి సచివాలయానికి 20 లక్షలుచప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెరిచర్ల విజయ నరసింహరాజు జెడ్‌పిటిసి సభ్యుడు కండ్రెగులా నరసింహారావు, ఎంపీటీసీ లు కోళ్ల బాలకృష్ణ, నాగిడి నారాయణస్వామి, నాయకులు తోటనాగు, న మన మహేష్, చిన్న మిల్లి నాగన్న, కొట్టి కుటుంబరావు, కోమటి రాంబాబు, కొప్పర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
