సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ మంత్రి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు గుంటూరు లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీ నారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి మీడియా సమావేశంలో .. తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ లో రాష్ట్ర పెద్దలు ఏకపక్ష నిర్ణయాలు తనకు ఇబ్బందిగా పరిణమించాయని , జనసేన తో పొత్తులో కూడా బీజేపీ పెద్దలు సమన్వయంతో వ్యహరించలేకపోతున్నారని కన్నా అభిప్రాయపడ్డారు. పార్టీ మార్పుపై చాల కాలంగా ఊపందుకుంటున్న ఊహాగానాలకు ఈ సమావేశం తో ఫుల్ స్టాప్ పెట్టారు. . ఈ నెల 23, 24 తేదీల్లో జనసేన పార్టీ లోకి మారేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.. అయితే టీడీపీ నుండి కూడా పిలుపు ఉన్నట్లు తెలుస్తుంది.
