సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో గత సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులు అయిన అగ్ని ప్రమాద బాధితులను నేడు, మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరపాన అన్ని విధాలా ఆదుకుంటామని భోరోసా ఇచ్చారు. గత రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన మూడు కుటుంబాలకు చెందిన పడవల సత్యనారాయణ, పడవల దాసు, పొలమూరు నాగరత్నలు మంగళవారం గ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు రూ. ఒక్కొక్కరికి 15,000 చప్పున తక్షణ సాయంగా అందజేశారు. త్వరలో బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పారు.
