సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్టణాలలో విద్యార్థులను, యువత ను టార్గెట్ గా చేస్తున్న గంజాయి అమ్మకాలు అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఇటీవల పోలీసులు రైల్వే పోలీసులు సహకారంతో చేస్తున్న కృషి తనిఖీలు తెలిసిందే.. ఏలూరు సమీపంలో గత బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండంగా ఒక వ్యాన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకోనట్లు రూ. 74 లక్షలు విలువైన 735 కేజీల గంజాయిని, వ్యాన్, సెల్‌ఫోన్ పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రకటించారు. ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. . తమిళనాడు రాష్ట్రం చుట్టుకూడి గ్రామానికి చెందిన మురళిబాలకృష్ణన్ తుని పట్టణానికి వచ్చి సన్యాసిరావు అనే వ్యక్తి ద్వారా సుమారు 735 కేజీల గంజాయిని 21 బస్తాలలో వ్యాన్ లో లోడ్ చేశాడు. చెన్నైకు చెందిన మహమ్మద్‌ఆలీకి ఇచ్చేందుకు శివ అనే వ్యక్తి తీసుకు వెళ్తున్నాడు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వ్యాన్ ఆపి తనిఖీ చేశారు. దీంతో గంజాయి రవాణా గుట్టు రట్టయ్యింది. నిందితుడు మురళిబాలకృష్ణన్‌ను అరెస్టు చేశారు. మిగితా నిందితులను అరెస్టు చేసేందుకు విశాఖ ఏజన్సీకి వెళ్లేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పెదవేగి సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ నాగబాబు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.( ఫై తాజా చిత్రంలో గంజాయి ని పరిశీలిస్తున్న ఏలూరు ఎస్ పి )
