సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి అగ్ర రాజ్యం అమెరికా శీతాకాలపు మంచు తుపాను చలిగాలులు మంచు తో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోం ది. దీం తో లక్షలాది ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. నేటి గురువారం తెల్లవారుజామునాటికి దేశవ్యా ప్తంగా 1,550 విమానాలు రద్దయ్యాయి. దాదాపు 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. వాటిలో దాదాపు సగం మిచిగాన్ సిటీలోనే ఉన్నాయి. లాస్ఏంజెల్స్ సమీపంలో సాధారణంగా వెచ్చ గా ఉండే ప్రాంతాలకు సైతం అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం (NWS) గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే చలిగాలులతో పాటు భారీగా మ చు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్ను వెంట ఉంచుకోవాలని సూచించింది. డెన్వ ర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపొలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్ల నగరాలలోనూ పరిస్థితులు దారుణంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *