సిగ్మాతెలుగు డాట్, ఇన్: న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవమైన పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం తాజగా నిధులు విడుదల చేసింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకగ్రీవ మైన ఎన్నికలకు 81 పంచాయతీలకు బహుమతిగా 6 కోట్ల రూపాయలు అందనుంది. పంచాయితీల జనాభా ఆధారంగా కేటగిరీల వారీగాబహుమతి నిధులు పంపిణి జరుగుతుంది. అందించనున్నారు. 2000లోపు జనాభా వున్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2001 నుంచి 5000 వేలు జనాభా వున్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5001 నుంచి 10 వేలలోపు వున్న పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ. 6 కోట్లు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరీల వారీగా పరిశీలిస్తే 5001 నుంచి 10 వేలలోపు జనాభా వున్న మేజర్ పంచాయతీలు ఐదు ఏకగ్రీవం కాగా వాటికి ఒక్కొక్క పంచాయతీకి రూ.15 లక్షలు చప్పున లబ్ది పొందాయి. మొత్తం 81 పంచాయతీల లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
