సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చేపలు, రొయ్యలు ఎగుమతులలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలోని రైతులకు కొందరు నకిలీ మెతలను సప్లై చేసి పంట దిగుబడిని తీవ్రంగా నష్టపోయేలా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజగా.. 5గురు సభ్యుల నకిలీ ముఠా గుట్టు రట్టు అయింది. ప్రఖ్యాత కంపెనీలను పోలిన నకిలీ మేత బస్తాలను ఆక్వా రైతులకు అమ్ముతున్న కొందరు వ్యాపారుల గుట్టు కలిదిండి పోలీసులు రట్టు చేసారు. కైకలూరు సర్కిల్ సీఐ వైవీవీఎల్.నాయుడు, కలిదిండి ఎస్ఐ మణికుమార్లు కలిదిండి పోలీసుస్టేషన్లో మీడియా తో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో సీ బాస్ బయో రెమిడీస్ కం పెనీ ఫినామిన్ ఆక్వా మినరల్స్ మేతలను రొయ్యల రైతులకు డీలర్ల ద్వారా సరఫరా చేస్తోంది. దీంతో భీమవరానికి చెందిన సయ్యపురెడ్డి మునీంద్ర, గుంటూరు జిల్లా, సీతానగరానికి చెందిన చిట్టిప్రోలు వెంకట కోటేశ్వరరావుతో అచ్చు గుద్దినట్లు ఉండే సీ బాస్ బయో రెమిడీస్ సంచులను తయారు చేయించాడు. అక్కడ నుంచి మంచి శ్రీనివాసరావు సహకారంతో ఈ సంచులలో సున్నం నింపి వాటిని భీమవరం లో మునీంద్ర గోడౌన్లో నిల్వ చేయించాడు. కోరుకోల్లుగ్రామానికి చెందిన కేశిరెడ్డి వెంకట బలరామకృష్ణ సమీప రైతులకు వీటిని విక్రయిస్తాడు. వీరి నకిలీ పీడ్స్ అమ్మకాలు ఇలా జరుగుతుండగా గత ఫిబ్రవరి 5న ముదినేపల్లి మండలం సీ బాస్ బయో రెమిడీస్ మేనేజర్ బండి ఫణికుమార్ కలిదిం డి పోలీసులకు ఫిర్యా దు చేయగా ఐదుగురు సభ్యుల నకిలీ రాకెట్ ముఠా ను అరెస్ట్ చేసి మెతలను సీజ్ చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *