సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో నేడు, సోమవారం భూమి కంపించింది. ముఖ్యముగా తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలురావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారగా పలుచోట్ల సిమెంట్ రోడ్లు పగుళ్లు వచ్చాయి. స్థానిక వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నతాధికారులుతో కలసి రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రిక్టర్ స్కేలుపై ఎంత నమోయ్యింది..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి అధికారులు ఆరాతీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయితే గత ఫిబ్రవరి నెలలో ఏపీలోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో భూప్రకంపనలు రావడంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూప్రకంపనలు రావడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *