సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో దశాబ్దాలుగా భీమవరం డీఎన్ ఆర్ కళాశాల కు ఒక ప్రతిష్టాత్మక స్థానం ఉంది. దీనితో భాగంగా నేడు, మంగళవారం 2023-2028 కాలానికి సంబందించి దంతులూరి నారాయణ రాజు కళాశాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి మరియు పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. దీనికి సహకరించిన మహాజన సభ్యులకు మరోసారి ఎన్నికయిన అద్యక్షులు, గోకరాజు వెంకట నరసింహరాజు మరియు కార్యదర్శి అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు కృతజ్ఞతలు తెలియజేసారు. దంతులూరి నారాయణ రాజు కళాశాల అసోసియేషన్ లో అనుబంధంగా నడబపడుతున్న వివిధ విద్యాసంస్థల అభివృద్ధికి మిక్కిలి కృషి చేస్తామని, వివిధ విద్యా సంస్థలలో ఉన్నత ప్రమాణాలుకొనుసాగిస్తూ వాటిని ముందుకు తీసుకు వెళ్ళగలమని తెలియజేసారు. ఈ రోజు న జరిగిన మొదటి పాలకవర్గ సమావేశంలో ఆఫీస్ బేరర్ల నియామకం జరిగింది. ఎన్నికయిన వారి వివరములు: వైస్ ప్రసిడెంట్ లుగా గోకరాజు పాండు రంగరాజు, చేకూరి శ్రీనివాస రాజు ఎన్నిక కాగా, సహాయ కార్యదర్శిగా కూనపరాజు రామకృష్ణంరాజు, కోశాధికారిగా కొత్త వెంకట శ్రీరామనారాయణ , కొత్తపల్లి శివరామరాజు, సహాయ సెక్రటరీ పాలక వర్గ సభ్యులు గా అల్లూరి సుబ్బరాజు (ఎ.యస్.రాజు), చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ,, పాలకవర్గ సభ్యులుగా జంపన రామలింగ రాజు, నంద్యాల మదన్ మోహన్ లచ్చిరాజు, మంతెన వెంకట కృష్ణంరాజు, మంతెన వెంకటవిశ్వనాథ సత్యనారాయణ వర్మ రాజు, యన్.వి. సత్యనారాయణరాజు, వేగేశ్న వెంకట సత్యనాగ భాస్కర బంగార్రాజు, దంతులూరి నారాయణరాజు, గన్నాబత్తుల లక్ష్మీ నారాయణ కుమార్ ఎన్నికయ్యారు. కో -ఆప్ట్ సభ్యులు గా దంతులూరి కోటేశ్వర రాజు,పెన్నెత రామకృష్ణంరాజు, అల్లూరి సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *