సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో నేడు, గురువారం ఉదయం డిఎస్పీ , బి శ్రీనాధ్ , టాఫిక్ సీఐ దాస్ లు భీమవరంలో ప్రజలు పాటించవలసిన ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరించి , వాహన దారులు ప్రమాదాలు జరిగితే వారి ప్రాణ రక్షణ కోసం తప్పిని సరిగా ధరించవలసిన హెల్మట్స్ వినియోగం గురించి ఆహూతులకు వివరించి సదస్సు నిర్వహించారు. వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. చేసారు. ఈ నేపథ్యంలో ఛాంబర్ అడ్జక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త, కార్యదర్శి కాగిత వెంకట రమణ, సభాపతి ఇతర చాంబర్ ప్రముఖులు, సభ్యులు పోలీస్ అధికారులకు శాలువాలు కప్పి అబినందనలు తెలిపారు.
